అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బటర్ ఫ్లై. ఫిబ్రవరి 18 అనుపమ పుట్టిన రోజు సందర్భంగా బటర్ ఫ్లై టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పోస్టర్ బ్యాక్ డ్రాప్‌లో సీతాకోకచిలుకలా కలర్ ఫుల్‌గా డిజైన్ కనిపిస్తుండగా అనుపమ బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు సతీష్ బాబు. ఇంతకీ ఓ జోనర్ లో సినిమా రాబోతుందనే దానిపై రానున్న టైంలో క్లారిటీ రానుంది. యువత, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా వైవిద్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం అని చిత్రయూనిట్ పేర్కొంది. గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం: అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోనా కట్టా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నారాయణ. ప్రస్తుతం బట్టర్ ఫ్లై సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
