Skip to main content

Namaste NRI

క్రేజీ కళ్యాణంలో అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్

అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ కల్యాణం. నరేష్‌ వీకే, తరుణ్‌భాస్కర్‌, అఖిల్‌ ఉడ్డెమారి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బద్రప్ప గాజుల దర్శకత్వం. ఈ చిత్రాన్ని బూసమ్‌ జగన్‌ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పెళ్లి కూతురుగా ముస్తాబై పట్టరాని ఆనందంతో డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తున్నది అనుపమ పరమేశ్వరన్‌.

పెళ్లి చుట్టూ సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఆమె కీర్తి అనే పాత్రలో కనిపిస్తుందని, తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ ధూపాటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: బద్రప్ప గాజుల.

Social Share Spread Message

Latest News