సంతోష్శోభన్ నటిస్తున్న తాజా చిత్రం కళ్యాణం కమనీయం. ప్రియ భవానీ శంకర్ కథానాయిక. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకుడు. యువీ కాన్సెప్ట్ సంస్థ నిర్మిస్తున్నది. ట్రైలర్ను ప్రముఖ కథానాయిక అనుష్క శెట్టి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన చిత్రమిది.ప్రేమ, పెళ్లి, కుటుంబం ఇలా అన్ని భావోద్వేగాలను మేళవించి రూపొందించిన సినిమా ఇది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. లవ్, ఎమోషన్ .. కామెడీ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భర్తకి ఉద్యోగం లేకపోవడం, భార్య ఫీల్ కావడం .. భార్య జాబ్ చేస్తుంది కదా అని భర్త ఆ విషయాన్ని లైట్ తీసుకోవడం .. అదే వారిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించడం ఈ కథలో ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. భారీ సినిమాల మధ్య థియేటర్లకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, సహ నిర్మాత: అజయ్ కుమార్ రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నరసింహా రాజు.