తేజస్, సౌజన్య, శివ, జషిల్, శ్రీవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అనుష్క. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ ఫిలించాంబర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అనుష్క ట్రైలర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉంది. అనుష్క నటించిన అరుంధతి చిత్రానికి గ్రాఫిక్స్ విభాగంలో పని చేశారు సుదర్శన్. ఆ అభిమానంతోనే ఈ సినిమాకి అనుష్క అనే టైటిల్ పెట్టుకున్నారు. కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శక నిర్మాత మా చాంబర్ మెంబర్ కావడంతో అన్నీ విధాలుగా సపోర్ట్ అందిస్తున్నాం అన్నారు. దర్శక నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమా అంతా పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. సంగీతం: సోవన్ చిన్న, ఛాయాగ్రహణం: సిహెచ్. నవీన్ కుమార్. సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)