ప్రముఖ కథానాయిక అనుష్క తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పి.మహేష్ కుమార్ దర్శకుడు. ప్రమోద్ నిర్మాత. మహిళా దినోత్సవం సందర్భంగా అనుష్క కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో అనుష్క చాలా అందంగా కనిపిస్తోంది. విదేశీ లోకేషన్‌లో ఓ బిజీ రోడ్ తనదైన శైలిలో నవ్వుతూ రోడ్ దాటుతున్నట్టుగా వుంది అనుష్క. హీరోయిన్ విదేశాల్లో ఉన్నట్లు, హీరో హైదరాబాద్ లో ఉన్నట్లు చెప్పారు. హ్యాండ్‌బ్యాగ్, ఫుల్‌డ్రెస్‌లో తన లుక్ కూడా చాలా హాట్‌గా కనిపిస్తుంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లవ్ స్టోరీగా కూడా ఈ సినిమా ఉండనుందని సమాచారం. మొత్తంగా రెండు డిఫరెంట్ మెంటాలిటీలు కలిగిన వ్యక్తుల మధ్య జరిగే రొమాంటిక్ డ్రామానే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ అని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అర్థం అవుతుంది. ఏది ఏమైనా దర్శకుడు ఫస్ట్ లుక్, టైటిల్ విషయంలో ప్రత్యేకత చాటుకున్నాడు. సినిమాపై అంచనాలు పెంచేశాడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్.