Namaste NRI

మ‌లేషియా ప్ర‌ధానిగా అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్

మ‌లేషియా మాజీ ప్ర‌తిప‌క్ష నేత అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్ ఆ దేశ ప్ర‌ధాని అయ్యారు. అయితే ఆ దేశ చ‌క్ర‌వ‌ర్తి సుల్తాన్ అబ్దుల్లా  కొత్త ప్ర‌ధానిని నియ‌మించారు. చ‌క్ర‌వ‌ర్తి సుల్తాన్ స‌మ‌క్షంలో మ‌లేషియా ప్ర‌ధానిగా అన్వ‌ర్ ఇబ్ర‌హీమ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. మలేషియాకు అన్వ‌ర్ ప‌ద‌వ ప్ర‌ధాని కానున్నారు.   పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మెజారిటీ రాక‌పోవ‌డంతో అక్క‌డ ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అన్వ‌ర్ లేదా మాజీ ప్ర‌ధాని యాసిన్ ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్వ‌ల్ప మెజారిటీ కూడా సాధించ‌లేక‌పోయారు.

అన్వ‌ర్‌కు చెందిన ప‌కాట‌న్ హ‌ర్ప‌న్ (పీహెచ్‌) పార్టీ ఎన్నిక‌ల్లో ఎక్కువ సంఖ్య‌లో సీట్లు గెలిచింది. కానీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన‌న్ని సీట్లను ఆ పార్టీ గెల‌వలేక‌పోయింది. అయితే ఏ పార్టీలు కూట‌మిగా మారుతాయో ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. 1990 ద‌శ‌కంలో మ‌లేషియా డిప్యూటీ ప్ర‌ధానిగా అన్వ‌ర్ చేశారు. అప్ప‌ట్లో మాజీ ప్ర‌ధాని మ‌హ‌తిర్ స్థానంలో అన్వ‌ర్ వ‌స్తార‌ని ఆశించారు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events