రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్.రాజ్, సునీల్ మల్లెం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఏపీ04 రామాపురం. హెమా రెడ్డి తెరకెక్కించారు. రామ్ రెడ్డి అందూరి నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ 19 ఏళ్ల వయసులో ఈ చిత్ర కథ రాయడం మొదలు పెట్టాను. 23 ఏళ్లకు తెరపైకి తీసుకొచ్చాను. చిత్ర పరిశ్రమలో ప్రోత్సాహం ఉండదంటారు. కానీ ఈ చిత్రం కోసం ఇంత మంది వచ్చి అండగా నిలబడ్డారు. అందరికీ ధన్యవాదాలు అన్నారు. నిర్మాత మాట్లాడుతూ మంచి కథతో తక్కువ బడ్జెట్‌లోనే సినిమా చక్కగా చేశాం మా ప్రయత్నం విజయ వంతం చేయాలని కోరుతున్నా అన్నారు. ఈ వేడుకకు సోహెల్, జెస్సీ, పృథ్వి రాజ్, నందు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ వేగి, అబు, ఛాయాగ్రహణం : మల్లి కె.చంద్ర, వినయ్ కుమార్ జంబరపు.
