ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన నీటి దోపిడీనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని, వారి అడుగు జాడల్లోనే ఆయన నడుస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా నది నీళ్ల వాడకంపై కేంద్రాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రియించిన ఏపీ ప్రభుత్వ తీరును ఆయన అభిశంసించారు. ప్రస్తుత నీళ్ల సమస్యకు ఏపీ వైఖరే కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకాన్ని ఏపీ నిరాకరించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 203ని ఉపహసంహరించుకోవాలన్నారు. కృష్ణా నది నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకుపోయేందుకు ఉద్దేశించిందే ఈ జోవో నంబర్ 203. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి నదుల్లో తన హక్కు వాటాగా ఉన్న నీటిని వినయోగించుకునేందుకేనని తెలిపారు. ఉమ్మడి నిధులతో ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టింది ఎవరూ? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో 15 లక్షల మంది వలసలు పోయేందుకు సీమాంధ్ర పాలకులే కారణమన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విజృంభణకు కారకులు వారేనన్నారు. ఆంధ్రా సర్కార్ తీరు చూస్తుంటే ఆకతాయి తనం గుర్తుకు వస్తోందన్నారు. ఉద్యోగుల, ఆస్తుల లెక్కల్లోనూ విభజన జరగాల్సిందేనని పేర్కొన్నారు.