
అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌హౌస్‌ను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సందర్శించారు. తానా సభల కోసం అమెరికా వెళ్లిన స్పీకర్ వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌కు వెళ్లారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సతీశ్ వేమన ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానమే ప్రజలకు దీవెన అని తెలిపారు. సాంకేతిక, వాణిజ్య రంగాల్లో భారత్`అమెరికా మధ్య సంబంధాలు పరస్పరం ప్రయోజనకరంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అమెరికాలోని తెలుగువారంతా తమ మేధోశక్తితో దేశానికి మంచి పేరు తెస్తూ రాష్ట్ర యువతకు, శ్రమైక జీవనానికి ఆదర్శంగా నిలిచారన్నారు. వైట్‌హస్‌ను సందర్శించిన వారిలో ఎంపీ కె.సుధాకర్, కాకినాడ పోర్టు చైర్మన్ కేవీ రావు ఉన్నారు.
















