విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారం రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచనల తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టును ఏసీపీ తప్పుదోవ పట్టించారని హైకోర్టు మండిపడి ంది. ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని విజయవాడ ఏసీపీని గతంలో హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకుండా తమను తప్పుదోవ పట్టించారన్న హైకోర్టు ఏసీపీకి వారం పాటు జైలుశిక్ష విధించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలు హైకోర్టు వారం పాటు వాయిదా వేసింది.