తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికాతో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు ఎన్నారై టీడీపీ కమిటీలను ప్రకటించింది. లాస్ ఏంజిల్స్ ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ కమిటీకి వెంకట్ ఆళ్ల అధ్యక్షుడిగా, సురేష్ అంబటి ఉపాధ్యక్షుడిగా, రాహుల్ వాసిరెడ్డి సెక్రెటరీగా, విష్ణు అటుకారి ట్రెజరర్‌గా, హేమకుమార్ గొట్టి సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, చందు నంగినేని రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్‌గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ ఆళ్ల మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఈ బాధ్యతని అప్పగించిన జయరాం కోమటి, డాక్టర్ రవి వేమూరిలకు ధన్యవాదాలు చెప్పారు. లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఉన్న పార్టీ అభిమానులను, ఒక్క తాటిపైకి తెచ్చి, చంద్రబాబును మరల ముఖ్యమంత్రిని చేయడంలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు.
