దక్షిణాఫ్రికా, కెనడాలోని వివిధ టీడీపీ శాఖలకు కార్యానిర్వహక కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వివిధ ఎన్నారైలను కమిటీ సభ్యులుగా నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కెనడాలోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఎన్నారై శాఖలతో పాటూ దక్షిణాఫ్రికా ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు. దక్షిణాఫ్రికా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా రామకృష్ణ పార, కెనడా పశ్చిమ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా సుంకర్ సుమంత్, సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా రామకృష్ణ వడ్డెంపూడి, తూర్పు ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా మురళీ కృష్ణలను నియమించారు.
