గ్రూప్ -1 పరీక్షలకు మినహా ఏ నోటిఫికేషన్‌కూ ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీకి సంబంధించి ఒకే పరీక్ష ఉంటుందని, దాని ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు ప్రకటించారు. త్వరగా పోస్టులను భర్తీ చేయాలన్న సంకల్పంతోనే ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లను ఆగస్టు మాసంలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.