అమెరికాలోని అట్లాంటాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) 15 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ సంబురాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా కర్టన్ రైజర్‌తో ప్రారంభమైన ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి తెలుగు రాజకీయ నాయకులు, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు.గాయకుడు రఘు కుంచె తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ప్రధాన దాతలు సుబ్బు కోట, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య, సత్య తోట తదితురులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బీజేపీ ఎంపీ బండి సంజయ్, పసుపులేటి హరి ప్రసాద్, రామ్ బండ్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్, హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ సమంత పాల్గొన్నారు.