ఆపిల్ కంపెనీకు ఆరామ్‌కో షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ జాబితాలో సౌదీకి చెందిన ఆయిల్ కంపెనీ ఆరామ్‌కో తొలి స్థానంలో నిలిచింది. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థను వెనక్కి నెట్టేసి ఆరామ్‌కో కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. రెండేళ్ల తర్వాత మళ్లీ టాప్ ప్లేస్‌ను ఆరామ్‌కో చేజిక్కించుకున్నది. ఆపిల్ సంస్థలో ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్మేయడంతో ఆ కంపెనీ విలుత తగ్గింది. ఆపిల్ షేర్లు 5 శాతం పడిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ విలువ 2.37 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇంధన కంపెనీ ఆరామ్‌కో విలువ 2.42 ట్రిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.