Namaste NRI

అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ..ఐతే అది ఇప్పట్లో సాధ్యం కాదు

 మీరు అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐతే అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే విజిట్ వీసాల కోసం వెయిట్ టైమ్ ఊహించనంతగా పెరిగింది.  అమెరికాకి టూరిస్ట్‌ వీసాల (బి-1,బి-2 వీసాల) కోసం వ్యవధి ముంబాయిలో 999 రోజులు, హైదరాబాద్‌లో 994 రోజులు, ఢిల్లిలో 961 రోజులు పడుతుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసాల జారీలో భారతీయులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొంది. వాస్తవం ఇది కాగా, అమెరికన్‌ టూరిస్ట్‌ వీసాలకు వెయ్యి రోజులు పైనే పడుతోంది. బి-1, బీ-2 వీసాలకు వ్యవధిని తొమ్మిది మాసాలకు తగ్గించినట్టు వివరించింది.  గతంలో టూరిస్టు వీసాలపై అమెరికాని సందర్శించినవారు ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు పొందుతారని అధికారులు తెలిపారు. వీసాల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ కాలాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు వివరించారు. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌వీసాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుతెలిపారు. క్రూవీసాలను వీలైనంత త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events