
నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి ఇందులో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా కొత్త పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్‌రామ్, విజయశాంతి డైనమిక్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, త్వరలో గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వహించనున్నామని, ఆ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ని లాంచ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సోహైల్‌ఖాన్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్ విస్సా, కెమెరా: రామ్ ప్రసాద్, సంగీతం: అజనీష్ లోకనాథ్, సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.
