Namaste NRI

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి  సెకండ్ సింగిల్

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి. ప్రదీప్‌ చిలుకూరి దర్శకుడు. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ వేగం పెంచారు. ముచ్చటగా బంధాలే  అంటూ సాగే రెండో గీతాన్ని ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు. చిత్తూరులోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ పాటను విడుదల చేయబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. తల్లీకొడుకు మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ భావోద్వేగభరితంగా ఈ పాట సాగుతుందని మేకర్స్‌ తెలిపారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని, ఐపీఎస్‌ వైజయంతీగా విజయశాంతి నటన ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. సోహైల్‌ఖాన్‌, సాయిమంజ్రేకర్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ నెల 18న భారీ స్థాయిలో విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాతలు: అశోక్‌వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు, రచన-దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events