Skip to main content

Namaste NRI

ఘ‌నంగా అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య‌ వివాహం

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఇంట పెండ్లి సందడి నెలకొంది. అర్జున్‌ కూతురు ఐశ్వర్య అర్జున్‌  నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, కమెడియన్‌ తంబి రామయ్య కుమారుడు, తమిళ హీరో ఉమాపతి రామయ్య  వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలోని గెరుగంబాక్కమ్‌లో అర్జున్ కట్టించిన హనుమాన్‌ ఆలయంలో ఈ పెండ్లి వేడుక జరిగింది.

బంధుమిత్రులు, సన్నిహితులు, ఇండస్ట్రీ స్నేహితుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్‌- ఉమాపతి రామయ్య ఏడ డుగులు వేశారు. సముద్రఖని, విశాల్‌ తండ్రి జీకే రెడ్డి, కేఎస్ రవికుమార్‌, నటుడు విజయ కుమార్‌తోపాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్‌ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చెన్నైలోని పాపులర్ ఫైవ్‌స్టార్ హోటల్‌లో రిసెప్షన్‌ జరుగనుంది.

Social Share Spread Message

Latest News