Namaste NRI

తానా 24వ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్‌ వేదికైంది. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌ లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరగనున్నది. ఈ మహాసభల ఏర్పాట్లు పూర్తయిందని, అతిధులు వస్తున్నారని కాన్ఫరెన్స్‌ కో ఆర్డినేటర్‌ ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు తెలిపారు. 

ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని,  ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ సినీ సంగతీ దర్శకుడు తమన్‌, ప్రముఖ గాయని చిత్రతో సంగీత విభావరిని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సినీ నేపథ్య గాయకురాలు సునీత, గాయకుడు ఎస్‌.పిబి. చరణ్‌తో కూడా లైవ్‌ మ్యూజిక్‌ కార్యక్రమం ఉంటుందని, వీరితోపాటు నేపథ్య గాయనీగాయకులు కూడా ఈ మహాసభల్లో తమ పాటలతో ఆనందపరచనున్నారని తెలిపారు. ప్రముఖ హీరోయిన్‌ సమంత ఈ మహాసభలకు వస్తున్నారు. తెలుగు కమ్యూనిటీ మహాసభలకు ఆమె రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. అలాగే మరో హీరోయిన్‌ ఐశ్వర్యరాజేష్‌ కూడా హాజరవుతున్నారు. సెలబ్రిటీలతో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం ఉంటుంది. అన్నమాచార్య స్వరార్చన పేరుతో శ్రీమతి శోభారాజు కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు.

ఈ మహాసభలకు సినిమా, సాహిత్యం, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వస్తున్నారని చెప్పారు. మహాసభలకు  సాధారణ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు  జూలై 4, 5వ తేదీ వరకు జరుగుతుంటాయి. వచ్చిన అతిధులకోసం అక్కడికి సమీపంలో ఉన్న హోటళ్ళలో రిజర్వేషన్‌ సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాన్ఫరెన్స్‌కు వచ్చే అతిధులు, ఇతరులకోసం ఆతిధ్య ఏర్పాట్లను అందరికీ సరిపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది వస్తున్న ఈ తానా మహాసభలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని ఉదయ్‌కుమార్‌ చాపలమడుగు కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events