వి.జె.సన్నీ, అషిమా జంటగా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సకల గుణాభిరామ. సంజీవ్‌రెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ మంచి కుటుంబ వినోదంతో రూపొందిన చిత్రమిది. చిన్న సినిమాగా ప్రారంభమై, ఎలాంటి ఇబ్బందులు లేకుండా థియేటర్లలో విడుదల అవుతుండడం సంతోషంగా ఉంది అన్నారు. కుటుంబ కథతో చక్కటి వినోదాత్మక సినిమాగా రూపొందిన ఈ సినిమా వంద థియేటర్లలో విడుదలవుతోంది. ప్రేక్షకులందరికీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు కథానాయకుడు సన్నీ.వి.జె. ఈ నెల 16న ఈ చిత్రాన్ని ఎస్.కె.ఎమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆదినారాయణ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సోహైల్, మానస్, జెస్సీ, హమీద, యాకర్ రవి, బిగ్ బాస్ జెస్సీ, డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.














