Namaste NRI

వేసవిలో అమ్మమ్మ ఇంటికి వెళ్లినంత హాయిగా… నందినీరెడ్డి

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న సినిమా అన్నీ మంచి శకునములే. స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్‌ నిర్మిస్తున్నాయి. ప్రియాంక దత్‌ నిర్మాత. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.  ఈ  చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్ వికె, బివి నందిని రెడ్డి తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నిజమేది రుజువేది  అని సాగే టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను మిక్కీ జే మేయర్‌ స్వరపర్చగా, రెహ్మాన్‌ సాహిత్యాన్ని అందించారు. కార్తీక్‌ ఆలపించారు.

దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ నటీనటులు, సాంకేతిక నిపుణులమంతా మనసు పెట్టి చేసిన సినిమా అన్నీ మంచి శకునములే. సకుటుంబంగా చూసేలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పింది. రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇది. వేసవిలో మన అమ్మమ్మ ఇంటికి వెళ్తే ఎంత హాయిగా వుంటుందో అలాంటి కథ ఇది అని అన్నారు. నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడుతూ మా స్వప్న సినిమా స్థాపించిన తర్వాత మాకన్నీ మంచి శకునములే ఎదురయ్యాయి.  స్టార్‌ హీరోలతో సినిమాలు చేయడం సులువు కానీ కొత్త వాళ్లతో ఆకట్టుకునే కథ కథనాలు, మంచి సంగీతంతో సినిమాలు నిర్మించి విజయాలు సాధించడం నిజమైన సక్సెస్‌గా భావిస్తా. నా బిడ్డలు ఈ సినిమాతోనూ అలాంటి సక్సెస్‌ అందుకోవాలి  అన్నారు. సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ నందినీరెడ్డి దగ్గర నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. స్వప్న అక్క నిర్మాణంలో పనిచేయడంతో నా కల తీరింది  అన్నారు. మే 18న విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events