తాను అధ్యక్ష పదవిలో ఉన్నంత వరకు బ్రెజిల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్ట్ జరగదని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా చెప్పారు. వచ్చే ఏడాది జీ20 సమావేశాలు బ్రెజిల్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో తమ దేశంలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతారని, అక్కడ పుతిన్ అరెస్టయ్యే అవకాశమే లేదని ఆయన అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యుద్ధ నేరాల చట్టం కింద అంతర్జాతీయ న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంజ్ జారీచేసింది. ఈ ఏడాది మార్చిలో పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన దేశం దాటి బయటికి రావడంలేదు. ఇవాళ భారత్‌లో ముగిసిన జీ20 సమావేశాలకు కూడా అదే భయంతో పుతిన్ డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.