Namaste NRI

మిస్ యూనివర్స్ ఇండియాగా… రియా సింఘా

జైపూర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీల్లో ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా సాధించుకున్నారు. గుజరాత్కు చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసు లోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించారు. 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2015 లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా ఈ ఈవెంట్కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. రియా సింఘా విజేతగా గెలిచిన అనంతరం ఊర్వశి తన చేతులతో కిరీటాన్ని బహుకరించారు.  ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా రియా నిలవడం ఆనందంగా ఉందని ఊర్వశీ అభినందించారు.

ఈ రోజు నేను టైటిల్ గెలుచుకోవడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.ఈ పోటీలో పాల్గొనడం కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలా కృషి ఉంది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకున్నాను అని రియా భావోద్వేగంతో మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రాంజల్ ప్రియ ఫస్ట్ రన్నరప్గా నిలిచారు. ఛవీ వర్గ్, సుస్మితా రాయ్, రూప్ఫుజానో విసో తరువాతి స్థానాల్లో నిలిచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress