![](https://namastenri.net/wp-content/uploads/2024/11/b87c51be-597c-4d61-9699-36202c2fdcb5-36.jpeg)
భారత సంతతికి చెందిన షిఫాలీ జమ్వాల్ మిసెస్ యూనివర్స్ అమెరికా 2024 కిరీటాన్ని దక్కించుకున్నారు. రెంటన్‌లో ఏంపవరింగ్.ఓఆర్‌జీ నిర్వహించిన పోటీలో ఆమె మిసెస్ యూనివర్స్ అమెరికాగా ఎంపికయ్యారు. దీంతో ఆమె వచ్చే ఏడాది జరిగే మిసెస్ యూనివర్స్ పోటీలకు అమెరికా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నా రు. జమ్ముకు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె అయిన జమ్వాల్ సీటెల్‌లో ఉంటూ ఎస్పెర్.ఈవోలో సీనియర్ ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. లైవ్2 ఎన్జీవోకు సహ వ్యవస్థాపకురాలు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/b3d00086-ff84-4237-b83a-c233d621b400-37.jpeg)