బ్రిటన్ ఆర్మీలో కెప్టెన్గా సేవలందిస్తున్న భారత సంతతికి చెందిన హర్ప్రీత్ చాందీ ప్రపంచ రికార్డు సృష్టించారు. దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ట్రైక్కింగ్ నిర్వహించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. `50 డిగ్రిల చలి, గంటలకు 60 మైళ్ళ వేగంతో వీస్తున్న ఈదురు గాలులను లెక్క చేయక ఆమె ఏకంగా 1130 కిలోమీట్లర్ల దూరం ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు. దక్షిణ ధ్రువానికి చేరుకునేందుకు ఆమెకు 40 రోజుల సమయం పట్టింది. ఎట్టకేలకు దక్షిణ ధృవానికి చేరుకున్నా ఇక్కడ మంచు కురుస్తోంది. ఇప్పుడు నా మనసులో భావాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మూడేళ్ల క్రితం నాకు ఇక్కడ పరిస్థితులపై కనీస అవగాహన కూడా లేదు. ఇక్కడ చేరుకునేందుకు చాలా కష్టపడ్డాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆర్మీ అధికారులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)