ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. దెయ్యాన్ని ప్రేమిం చిన ఓ యువకుడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బేనర్‌పై హర్షిత్‌రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఈ హారర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. లవ్ మీ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ చిత్రం ఇస్తుందని ఈ సందర్భంగా యూనిట్ తెలిపింది. ఎం. ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: పి. సి. శ్రీరామ్. ఎడిటర్: సంతోశ్ కామిరెడ్డి.