తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం మిరాయ్. సూపర్ యోధ ఉపశీర్షిక. ఈ సందర్భం గా ఈ సినిమా గ్లింప్స్‌ని ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. అశోకుని కాలంలోని రహస్య శాసనం మిరాయ్. కొందరు దాన్ని కాపాడుతుంటారు. ఆ శాసనానికీ, ఈ కథకూ సంబంధం ఏంటి? అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది అని దర్శకుడు కార్తీక్ చెప్పారు. విజన్ ఉన్న దర్శకుడు కార్తీక్ అని, వెండితెరపై కన్నుల పండువగా సినిమా ఉండబోతున్నదని, భారతీయ భాషల్లోనే కాక, చైనాలో కూడా సినిమా విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.
హను-మాన్ హీరోగా నా బాధ్యత పెంచింది. అందుకే జాగ్రత్తగా కథను ఎంచుకొని ఈ సినిమా చేస్తున్నాను. ఇందులో నన్ను యోధుడిగా చూపించబోతున్నాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆరు నెలల ముందే సినిమా మొదలుపెట్టాం అని తేజ సజ్జా తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో యూనిట్‌సభ్యులతో పాటు దర్శకులు నందినీరెడ్డి, శ్రీరామ్ ఆదిత్య, మల్లిక్‌రామ్, కృష్ణచైతన్య, నిర్మాతలు సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, బెక్కం వేణుగోపాల్, ఎస్‌కేఎన్ తదితరులు పాల్గొన్నారు. ఇక భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.