
అశ్విన్‌బాబు హీరోగా రూపొందుతోన్న మెడికల్ యాక్షన్ మిస్టరీ వచ్చినవాడు గౌతమ్. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. బ్లెడ్ అండ్ స్టెత్‌తో ఉన్న అశ్విన్‌ను ఈ లుక్‌లో చూడొచ్చు. 90శాతం నిర్మాణం పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. రియా సుమన్, అయేషాఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అభినయ, అజయ్, అమర్‌దీప్,వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్. బాల్‌రెడ్డి, సంగీతం: గౌరహరి, నిర్మాణం: అరుణశ్రీ ఎంటైర్టెన్మెంట్స్.
