రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ప్రాణాలతో బయటపడినట్లు ఓ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఉక్రెయిన్‌పై అటాక్ వల్ల రష్యా మిలిటరీకి భారీగా నష్టం వచ్చింది. దీంతో రష్యాకు చెందిన కొందరు రాజకీయవేత్తలు పుతిన్ రాజీనామా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పుతిన్‌పై హత్యాయత్నం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పుతిన్ ప్రయాణించే లిమౌసైన్ వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ వాహనానికి చెందిన లెఫ్ట్ ఫ్రంట్ వీల్ ధ్వంసమైంది. ఢీకొట్టిన సమయంలో భారీ శబ్ధం కూడా వచ్చినట్లు తెలిసింది. లిమౌసైన్ కారును ఢీకొన్న సమయంలో భారీగా పొగలు కూడా వచ్చాయని, కానీ సురక్షితంగా ఆ కారును చేర్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎటువంటి గాయం కాలేదు. కానీ ఈ ఘటనలో అనేక మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.