Skip to main content

Namaste NRI

ఆ దేశ సరిహద్దుల్లో ప్రతి  20 నిమిషాలకు.. ఓ  భారతీయుడు అరెస్టు

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ అక్కడి సరిహద్దుల్లో ప్రతి 20 నిమిషాలకు ఓ భారతీయుడు అరెస్ట్‌ అవుతున్నట్టు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం వెల్లడించింది. రోజుకు 65 మంది భారతీయులు అరెస్ట్‌ అవుతున్నట్టు తెలిపింది. అయితే 2024తో పోలిస్తే 2025లో ఈ సంఖ్య కాస్త తగ్గినట్టు పేర్కొన్నది. 2024లో 85,119 మందిని అరెస్ట్‌ చేయగా, 2025లో 23,830 మందిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపింది.అక్రమ వలసలకు భారత్‌ ప్రధాన దేశంగా నిలుస్తున్నదని ఈ నివేదిక ఆరోపించింది. అడ్డుకున్న భారతీయుల్లో అత్యధికులు ఉద్యోగం, మెరుగైన వేతనాల కోసం వచ్చిన వాళ్లే ఉన్నారని, కఠినమైన విధానాలు అక్రమ చొరబాట్లను గణనీయంగా తగ్గించగలిగినట్టు పేర్కొన్నది. దీంతో చొరబాటుదారులు అత్యంత ప్రమాదకరమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారని నివేదిక తెలిపింది.

Social Share Spread Message

Latest News