అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18వ కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నిర్వహించనున్నారు. అట్లాంటాలో ఆటా 18వ కన్వెన్షన్ జరపాలని గత మే 6న డాలస్ లో నిర్వహించిన బోర్డు సమావేశంలోనే పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. వచ్చే సంవత్సరం 2024 జూన్ 7, 8, 9 తేదీలలో మూడోసారి అట్లాంటాలో ఆటా కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు అయ్యింది. ఆటా చరిత్రలో రెండవ మహిళా అధ్యక్షురాలు మధు బొమ్మినేని అధ్యక్షతన, కిరణ్ పాశం కాన్ఫరెన్స్ కన్వీనర్‌గా, సాయి సుధిని నేషనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీధర్ తిరుపతి కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్‌గా, అనీల్ బొద్దిరెడ్డి కాన్ఫరెన్స్ డైరెక్టర్ గా జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్‌లో ఘనంగా ఆటా కన్వెన్షన్ నిర్వహిస్తారని అధికారికంగా ప్రకటించారు. గతంలో కూడా 2000, 2012 సంవత్సరాలలో ఆటా కన్వెన్షన్ అట్లాంటాలో విజయవంతంగా నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)