అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్వహించిన ఆటా-డే, ఉగాది వేడుకలు-2023 అరిజోనాలోని ఫీనిక్స్‌లో గత ఆదివారం (మార్చి 26న) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం ఎంతో కలర్ ఫూల్‌గా, పవర్ ప్యాకెట్‌గా, సేవ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. తెలుగు సంస్కృతి యొక్క వైవిధ్యం, గొప్పతనాన్ని తెలియజేసింది. అరిజోనా ఫీనిక్స్‌లోని ఫీనిక్స్ ష్రైన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రీయ, జానపద, ఫ్యూజన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, పౌరాణిక నాటకాలను ప్రదర్శించారు. డ్రాయింగ్, స్పీడ్-చెస్ వంటి అనేక ఇతర పోటీలు నిర్వహించారు. వివిధ షాపింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఫేస్-పెయింటింగ్, ప్లే-జోన్‌తో సహా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ప్రముఖ గాయకులు రఘు కుంచె, అంజనా సౌమ్య ప్రత్యక్ష మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. వారి పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించరు. ఈ కార్యక్రమం స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా అందించింది. ఈ ఈవెంట్‌లో 1500 మందికి పైగా హాజరయ్యారు. అరిజోనాలోని ఫీనిక్స్‌లో తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి వేదికను అందించిన తెలుగు సాంస్కృతిక కార్యక్రమం ఆటా డే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రాంతీయ డైరెక్టర్ రఘునాథ్ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. సమాజ సేవను ప్రోత్సహించడం, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని జరుపుకోవడం కోసం ఈ సందర్భంగా ప్రణాళికలు ప్రకటించారు.

ఈ సందర్భంగా ప్రాంతీయ కోఆర్డినేటర్లు వంశీ ఏరువరం, శేషిరెడ్డి గాదె, చెన్న మద్దూరి, ధీజ్ పోల, సునీల్ అననపురెడ్డి, మధన్ బొల్లారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు, సంస్కృతికి చెందిన వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

