అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేసన్ (ఆటా) ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడా దిగ్గజాలూ హాజరయ్యారు. 3వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కోసం వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబైంది. 17వ ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, క్రాంతి కిరణ్, గాదరి కిషోర్ తదితరులకు వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ యాస నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)