కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా అథర్వ. ఈ చిత్రాన్ని పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పకులు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు మహేష్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఐరా నటిస్తోంది. అరవింద్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ క్లూస్ టీమ్ నేపథ్యంగా మా సినిమా సాగుతుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందించాం. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ క్రైమ్, థ్రిల్ వంటి ఎమోషన్స్‌తో పాటు లవ్, కామెడీ అంశాలుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తున్నాం. క్రైమ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో ఈ సినిమా తెరపైకి రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/laila-1-300x160.jpg)