కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం అధర్య. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనేది ఉపశీర్షిక. సిమ్రాన్ చౌదరి కథానాయిక. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మహేష్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను కథానాయకుడు రవితేజ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా కొత్త అనుభూమతినిస్తుంది. కథ, కథనాలు ఉత్కంఠను పంచుతాయి. మలుపులు ఆకట్టుకుంటాయి. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది అన్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛాయాగ్రహణం : చరణ్ మాధవనేని.
