Namaste NRI

అమెరికాలో దారుణం… స్కూల్‌ టీచర్‌పై ఆరేండ్ల కుర్రాడు

అమెరికాలో గన్‌కల్చర్‌ నానాటికి పెరిగిపోతున్నది. కాలేజీలు, స్కూళ్లు అనే తేడా లేకుండా అన్నివయస్కుల వాళ్లు తుపాకులతో కాల్పులకు తెగబడుతున్నారు. అయితే వర్జీనియాలోని రిచ్‌నెక్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో  విస్తుపోయే ఘటన చోటుచేసుకున్నది. స్కూల్‌లో చదువుతున్న ఆరేండ్ల కుర్రాడు తరగతి గదిలోనే టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని స్థానిక పోలీస్‌ చీఫ్‌ స్టీవ్‌ డ్రూ చెప్పారు. విద్యుర్థులకు ఎలాంటి హానీ జరుగలేదన్నారు. నిందితుడైన ఆరేండ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇది ప్రమాద వషాత్తు జరిగిందేమీ కాదని చెప్పారు.

కాల్పుల ఘటనతో పాఠశాలలో గందరగోళం ఏర్పడింది. పాఠశాలలోని తరగతి గదిలో 30 ఏళ్ల టీచర్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ కాల్పులు జరిపిన ఘటన కాదన్నారు. నిందితుడిని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఆరేళ్ల విద్యార్థిగా గుర్తించారు. విద్యార్థి అదుపులో ఉన్నాడు. ఈ ఘటన టీచర్ పై జరిగిన ఘోరమైన దాడిగా పరిగణిస్తున్నారు.

Social Share Spread Message

Latest News