సౌత్ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకల్లో చేసే సందడిని చూసి ప్రేక్షకులు మైమరిచోతుంటారు. ఈ సారి హైదరాబాద్‌లో ఈ వేడుక నిర్వహించారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సైమా అవార్డుల వేడుక జరగగా, 2019 సంత్సరానికి సంబంధించిన విజేతలకు అవార్డులు అందించారు. మహర్షి సినిమాకు మహేష్ బాబు ఉత్తమ నటుడిగా ఎంపీ సంతోష్ కుమార్ నుంచి అవార్డును అందుకొన్నారు.
ఉత్తమ చిత్రం: జెర్సీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్),ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2 (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి), ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ), ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ), ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్), ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి), ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ), ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి), ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి), ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్), ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా), ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్), ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా), ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని, ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం), ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్ (జెర్సీ), ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3).