విదేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ హెచ్చరించారు. ఆయన రష్యా మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ గ్రేటర్ రష్యాలో భాగమని, సమీప భవిష్యత్తులో పశ్చిమ దేశాలతో తమ దేశ సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు లేవని చెప్పారు. అణ్వాయుధాల ముప్పు పెరుగుతున్నదని, అమెరికా, దాని మిత్ర దేశాలతో పోలిస్తే రష్యా అణ్వాయుధ సామర్థ్యం పెరుగుతున్నదని మెద్వదేవ్ అన్నారు. పశ్చిమ దేశాలు తమ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నా రష్యా అధినాయకత్వం దేశ సమగ్రత పట్ల హామీ ఇస్తున్నదన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/WB-7.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/d5b7f241-3200-42f7-aeb9-47b1f0e899f3-7.jpg)