Namaste NRI

కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది  : బుచ్చిబాబు సానా

విరాజ్‌ అశ్విన్‌ హీరోగా రూపొందుతోన్న చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్‌ దర్శకుడు. నిరీష్‌ తిరువీధుల నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు బుచ్చిబాబు సానా చేతులమీదుగా విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని బుచ్చిబాబు చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. బేబీ సినిమాతో యువతకు చేరువైన విరాజ్‌ ఈ సినిమాతో యువతకు మరింత దగ్గరవుతాడని, కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. జోరుగా హుషారుగా అనే టైటిల్‌కి తగ్గట్టే ఈ చిత్రంలో అందర్నీ ఆకట్టుకునే వినోదం ఉంటుందని, యువతరం మెచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని నిర్మాత తెలిపారు. ఈ నెల 15న చిత్రం విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events