మెగా హీరో వైష్టవ్ తేజ్ తాజా చిత్రం కొండపొలంతో అందరినీ అలరించేందుకు సిద్ధం అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఈ నెల 8 విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎం కీరవాణి, రాజీవ్ రెడ్డి, క్రిష్, వైష్టవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, నన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న హరిహర వీరమళ్లు షూటింగ్ గ్యాప్‌లో కాండపొలం సినిమా ప్రారంభం అయ్యింది. ఇక ఈ సినిమా చేయటానికి అనుమతిచ్చిన పవన్ కళ్యాణ్‌కి థాంక్స్ చెప్పాలి. నన్నపురెడ్డి వెంకటరెడ్డి ఈ నవలను రాయకపోయినా ఈ చిత్రం వచ్చేది కాదు. నేను ఈ సినిమా తీసింది అంతా ఒకెత్తు అయితే.. పై మెట్టులో పెట్టింది ఎంఎం కీరవాణి, ఆయన ఈ చిత్రాన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లారు. రయ్ రయ్ అనేది పాట కాదు మంత్రం. కీరవాణి, సిరివెన్నెల గారు అద్భుతమైన పాటలు రాశారు అని అన్నారు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ కీరవాణి ఈ చిత్రాన్ని అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథను తెరపైకి తీసుకొచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు అని తెలిపారు.