Skip to main content

Namaste NRI

విజయవంతంగా ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తానా పాఠశాల విద్యార్థులు కలిసి బాల రామాయణం నాటకం ప్రదర్శించారు. పిల్లల ప్రత్యక్ష తెలుగు భాషా సంభాషణతో రామాయణ పాత్రలను చేయడం ఈ కార్యక్రమం యొక్క మరో ప్రత్యేకత. పాఠశాల పిల్లలు చేసిన అద్భుతమైన నటనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు.

గౌరవ అతిథిగా సిటి మేయర్ జిమ్ గారు విచ్చేసి, పిల్లలను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా విశ్వ గురుకులం అంకురం పాఠ్యపుస్తకాన్ని వ్యవస్థాపక సభ్యుడు రామ్ మారం విడుదల చేసి, పాఠశాల మరియు విశ్వ గురుకులం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.పాఠశాల పూర్వ విద్యార్థులైన నిహారిక భమిడిపాటి మరియు రితిక గంగబత్తిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అలాగే పూర్వ విద్యార్థులైన ద్విజేష్ గొంట్ల మరియు సమయ సిద్ధాంత పొట్లచెరువు ఈ సంవత్సరం విద్యార్థులకు బోధించడం అభినందనీయం.

పాఠశాల కో-చైర్ రజని మారం మరియు ఉపాధ్యాయులు అనూష చిట్టూరి, ప్రతూష అట్లూరి, శ్వేత వెలగలేటి, రాజేష్ గంగబత్తిన, శ్రీదేవి కోట, మృదుల కొనంకి, వాసవి కల్వ మరియు విశ్వ గురుకులం ఉపాధ్యాయులు వంశీ భరద్వాజ్ ని తానా చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ మరియు తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి అభినందించారు. శ్రీనివాస్ లావు , శ్రీనివాస్ ఒరుగంటి, రాజా కసుకుర్తి , ఠాగూర్ మల్లినేనికు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News