Namaste NRI

ఆస్టిన్‌ తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏర్పాటు

అమెరికాలోని ఆస్టిన్‌ నగరంలో తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ (టీసీఏ) 2024వ సంవత్సరానికి గాను  నూతన కార్యవర్గం ఏర్పాటైంది.  రౌండ్‌ రాక్‌ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని పరిచయం చేశారు. అధ్యక్షుడిగా పరమేశ్వర రెడ్డి నంగి, ఉపాధ్యక్షుడిగా శ్రీని బైరపనేని, సెక్రెటరీగా భారత్‌ పిస్సాయ్‌, ట్రెజరర్‌గా చిన్నప రెడ్డి కుందూరు నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఐదుగురిని ఎన్నుకున్నారు. ప్రతిభ నల్ల (కల్చరల్‌), లక్ష్మీకాంత్‌ ( ఫైనాన్స్‌ అండ్‌ స్పాన్షర్షిప్‌), వెంకటేశ్‌ దూబాల ( ఫుడ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌), శ్రీలత అంబటి ( మెంబర్షిప్‌ అండ్‌ టెక్నాలజీ) సర్వేశ్వర రెడ్డి పాశం ( స్పోర్ట్స్‌) సంయుక్త కార్యదర్శులుగా నియమితు లయ్యారు.  బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లుగా అర్జున్‌ అనంతుల, గిరి మేకల, బ్రహ్మేంద్ర రెడ్డి లాక్కునిని ఎన్నుకున్నారు. గత కార్యవర్గంలో సేవలందించిన రామ్‌ హనుమంత మల్లిరెడ్డి, మురళీధర్‌ రెడ్డి వేలూరు, శ్రీనివాస్‌ బత్తులతో పాటు ఇతర టీసీఏ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events