ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలు కొత్త ప్లాన్ వేశాయి. నెక్ట్స్ జనరేషన్ అణ్వాయుధ జలాంతర్గాముల్ని డెవలప్ చేయనున్నాయి. దీనికి సంబంధించిన ప్లాన్‌ను మూడు దేశాలకు చెందిన నేతలు డిస్కస్ చేశారు. ఆకస్ అగ్రిమెంట్ కింద తొలుత ఆస్ట్రేలియాకు మూడు అణ్వాయుధ సబ్‌మెరైన్లను అమెరికా ఇవ్వనున్నది. అత్యాధునిక టెక్నాలజీ సహకారంతో ఈ మూడు దేశాలు న్యూక్లియర్ సబ్‌మెరైన్ ఫ్లీట్ ను రూపొందించనున్నాయి. ఈ జలాంతర్గాములకు బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ రియాక్టర్లను తయారు చేసి ఇవ్వనున్నది.
ఇండోపసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో. ఆ దేశానికి కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మూడు అగ్రదేశాలు ఆకస్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. శాన్‌డియాగోలో జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ న్యూక్లియర్ సబ్‌మెరైన్లకు చెందిన నాలెడ్జ్‌ను, స్కిల్స్‌ను ఆస్ట్రేలియన్ల తమ బేస్‌ల వద్ద నేర్చుకోవచ్చు అని తెలిపారు.
2027 నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ ర్యాన్ బేస్ వద్ద కొన్ని న్యూక్లియర్ సబ్‌మెరైన్లను ఉంచనున్నట్లు అమెరికా, బ్రిటన్ దేశాలు పేర్కొన్నాయి. ఇక 2030 లోగా ఆస్ట్రేలియా మూడు వర్జీనియా క్లాసుకు చెందిన జలాంతర్గాముల్ని అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నది. ఎస్ఎస్ఎన్-ఆయూకేయూఎస్ సబ్‌మెరైన్‌ను డెవలప్ చేయనున్నట్లు కూడా మూడు దేశాలు స్పష్టం చేశాయి. బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో దీన్ని నిర్మిస్తారు.