ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్‌కు ఆస్ట్రేలియాలోని ఓ న్యాయస్థానం గట్టి షాకిచ్చింది. యూట్యూబ్ వీడియోలు తన కెరీర్‌ను పాడు చేశాయంటూ ఓ మాజీ రాజకీయ నాయకుడు వేసిన పరువు నష్టం కేసులో ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్‌కు 7.15 లక్షల ఆస్ట్రేలియా డాలర్ల (సుమరు రూ.4 కోట్లు) జరిమానా విధించింది. న్యూసౌత్‌వేల్స్ స్టేట్ మాజీ డిప్యూటీ ప్రీమియర్‌గా జాన్ బరిలలో పని చేశారు. జాన్ బరిలలో పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా 2020 సెప్టెంబర్` అక్టోబర్ మధ్య కాలంలో జోర్డాన్ షాంక్స్ అనే కమెడియన్ పలు వీడియోలు యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోల కారణంగా బరిలలో రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. సదరు వీడియోలను తొలగించాలంటూ పలుమార్లు ఆయన రాసిన లేఖలను గూగుల్ సంస్థ పట్టించుకోలేదు. దీంతో బరిలరో కోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పుపై గూగుల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2020లో శాంక్స్ ఈ వీడియోలు పోస్ట్ చేయగా దాదాపు 8 లక్షల వీక్షలు లభించాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)