Namaste NRI

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై నుంచి అమల్లోకి  

విదేశీ విద్యార్థుల వలసలను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశీ విద్యార్థుల వీసా ఫీజు దాదాపు రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన వీసా ఫీజు జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.  వీసా ఫీజు 710 ఆస్ట్రేలియా డాలర్లు ఉండగా, దాన్ని 1600 ఆస్ట్రేలియా డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంతే కాదు విజిటర్ వీసాతోపాటు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాతో ప్రస్తుతం దేశంలోనే ఉన్న వారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేయకుండా నిషేధం విధించింది. రికార్డు స్థాయిలో విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించడంతోపాటు విదేశీ విద్యార్థులకు వసతి దొరకడం దుర్లభంగా మారింది. మా అంతర్జాతీయ విద్యా వ్యవస్థ సమగ్రతను పరిరక్షించేందుకు ఈ రోజు ఈ మార్పులు తీసుకొచ్చాం. స్వేచ్ఛగా, ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా ఉండేలా మైగ్రేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం’ అని ఆస్ట్రేలియా హోంమంత్రి క్లేర్ ఓ నీల్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events