ఆస్ట్రేలియా సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన వరుణ్ 17 ఏండ్ల వయసున్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది అయిన ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచబ్యాంకుకు సేవలు అందించారు. ఇదే సమయంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. సెనేటర్‌గా ఎన్నికైన అనంతరం వరుణ్ మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన విద్య, శిక్షణ అందేలా చూస్తానని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)