మూవీ లవర్స్ క్యూరియాసిటీతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు అవతార్ 2. ది వే ఆఫ్ వాటర్ అవతార్ విడుదలైన చాలా ఏళ్ల విరామం తర్వాత వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచానాలున్నాయి. ఇటివలే విడుదల చేసిన టీజర్ వాటిని పెంచేసింది. తాజాగా ఓ కొత్త ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇది ప్రేక్షకుల సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. పండోరా గ్రహాన్ని మించి అద్భుతాలు ఇందులో ఉంటాయని చిత్ర బృందం ముందు నుంచి చెబుతోంది. ఈ ట్రైలర్‌లో చిత్ర కథానాయకుడు, తన కుటుంబంతో గడిపే సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు అనుబంధాలను ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. సామ్ వర్తింగ్టన్, జోయా సల్డాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 16న విడుదల కానుంది.