ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మాండ. రాంబాబు దర్శకుడు. దాసరి సురేష్ నిర్మాత. బలగం జయరాం, కొమరక్క, బన్నీ రాజు తదితరులు నటిస్తున్నారు. తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. దర్శకుడు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ఒగ్గు కళాకారుల నేపథ్యంలో, వారి సంస్కృతి సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న తొలి చిత్రమిది. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం. ఒగ్గు అనే పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఆధ్యాత్మిక, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వరికుప్పల యాదగిరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంబాబు.