మెగాస్టార్ చిరంజీవి, అజేయ దర్శకుడు కొరటాల శివ కలయికలో వస్తోన్న మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ ఆచార్య. ఇందులో రామ్చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 28న సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ సిద్దాస్ సాగా పేరుతో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ధర్మమే సిద్ధ అని ట్విటర్లో పోస్టర్ను పంచుకున్నారు చిరంజీవి. అనేక కారణాలతో సిద్ధ పాత్ర గుర్తుండిపోతుంది. శక్తిమంతమైన టీజర్ రానుంది అని ట్వీట్ చేశారు చరణ్. చిరంజీవికి జోడిగా కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు చిత్రబృందం.